తెలంగాణ విద్యా రంగానికి సేవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందిస్తం : అతుల్ చౌహాన్

తెలంగాణ విద్యా రంగానికి సేవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందిస్తం : అతుల్ చౌహాన్
  • సీఎం రేవంత్ రెడ్డితో అమిటీ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్సిటీ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ అతుల్ చౌహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ విద్యా రంగం అభివృద్ధికి త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ వంతుగా సేవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందిస్తామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సీఎం రేవంత్ రెడ్డికి అమిటీ యూనివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్సిటీ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ అతుల్ చౌహాన్​  తెలిపారు. గురువారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలోని ఆయనను అతుల్​ చౌహాన్​ కలిశారు. తెలంగాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ యూనివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముద్ర వేసినందుకు కృత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జ్ఞత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తెలియజేశారు.

రాష్ట్రంలో స్కిల్ డెవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ యూనివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్సిటీతో తాము ఒప్పందం చేసుకుంటామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, స్కిల్ డెవలప్​మెంట్​ కార్యక్రమాల్లో భాగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వాముల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుతామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సీఎంకు చెప్పారు. మెరుగైన వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తులు, నాణ్యమైన విద్యా బోధ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇప్పటికే అమిటీకి మంచి పేరు ఉంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని.. తెలంగాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రింత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాణించేందుకు కృషి చేస్తామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అతుల్​ చౌహాన్​ అన్నారు. ఆయన వెంట అమిటీ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్సిటీ ప్రతినిధి రామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చంద్రం కూడా ఉన్నారు.